సూపర్ స్టార్ మహేష్ ఇండియాకి వచ్చేది అప్పుడేనట … ?

సూపర్ స్టార్ మహేష్ ఇండియాకి వచ్చేది అప్పుడేనట … ?

Published on Oct 23, 2022 12:52 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో SSMB28 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతాన్ని పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇక ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ ని జరుపుకున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ యొక్క సెకండ్ షెడ్యూల్ నవంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుండగా ఇటీవల తన పర్సనల్ కారణాల నిమిత్తం విదేశాలకు వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఈనెల 24న ఇండియాకి తిరిగి రానున్నారట.

అనంతరం నెక్స్ట్ షెడ్యూల్ కోసం సిద్ధం అవుతారట. మరోవైపు దాదాపుగా పన్నెండేళ్ల విరామం తరువాత మహేష్, త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ల్ ఓ రూపొందుతున్న ఈ మూవీ హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండగా దీనిని 2023, ఏప్రిల్ 28న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీలో మహేష్ బాబు క్యారెక్టర్ ని ఊర మాస్ స్టైల్ లో డిజైన్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్, తప్పకుండా తామిద్దరం కలిసి చేస్తున్న ఈ మూవీతో భారీ సక్సెస్ కొట్టేందుకు ఎంతో శ్రద్ధతో మూవీని తెరకెక్కిస్తున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. మరి అందరిలో ఇప్పటినుండే ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ తరువాత ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని నెలలు వెయిట్ చేయాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు