లేటెస్ట్ : విదేశాల్లో సూపర్ స్టార్ ఫిట్ నెస్ ట్రైనింగ్ ?

Published on May 5, 2023 8:10 pm IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న SSMB 28 మూవీ ఇటీవల కొంతమేర షూటింగ్ జరుపుకుంది. ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ గ్రాండ్ గా నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ఈ నెల మూడవ వారం నుండి మొదలు కానుంది.

ఇక ప్రస్తుతం స్పెయిన్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, తన బాడీ ఫిట్ నెస్ కోసం ఒకింత ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న త్రివిక్రమ్ మూవీని వీలైనంత త్వరలో పూర్తి చేసిన అనంతరం దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళితో చేయనున్న తదుపరి మూవీ షూట్ లో జాయిన్ అవ్వనున్నారు సూపర్ స్టార్. కాగా ఆ మూవీ భారీ యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతుండగా అందులో తన పాత్ర కోసం సూపర్ స్టార్ మరింత ఫిట్ గా కనిపించేందుకు సిద్ధం అవుతున్నట్లు టాలీవుడ్ బజ్. కాగా SSMB 28 మూవీని 2024 జనవరి 13న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :