సౌత్ లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన “కళావతి” సాంగ్

Published on Feb 14, 2022 7:00 pm IST

పరశురామ్ దర్శకత్వం వహించిన సూపర్ స్టార్ మహేష్ బాబు మోస్ట్ ఎవైటెడ్ చిత్రం సర్కారు వారి పాట మే 12 న విడుదల కానుంది. ఎస్ థమన్ సంగీతం అందించిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. కళావతి అనే టైటిల్ తో నిన్న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సిద్ శ్రీరామ్ స్వరాలు అందించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. రికార్డు సంఖ్యలో వీక్షణలు, మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ పట్ల ఉన్న అభిమానాన్ని చూపుతున్నాయి.

కళావతి 24 గంటల్లో 16 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. మరియు దక్షిణ భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడిన పాటగా నిలిచింది. లైక్స్ పరంగానూ ఈ పాట రికార్డు సృష్టించింది. కళావతి లిరికల్ వీడియో 24 గంటల్లో 806K లైక్స్ ను సంపాదించింది. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆర్ మధి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను చూసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :