‘మ్యాడ్’ మూవీ టీమ్ కి సూపర్ స్టార్ మహేష్ బెస్ట్ విషెస్

Published on Oct 4, 2023 7:09 pm IST


కాలేజి యువత నడుమ సాగె ఫన్నీ అంశాలతో యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మ్యాడ్. ఈ మూవీని కళ్యాణ్ శంకర్ తెరకెక్కించగా సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అవంతిక సునీల్ కుమార్, గోపిక ఉద్యన్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాయి సౌజన్య, హారిక సూర్యదేవర గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ఆకట్టుకుని మ్యాడ్ మూవీ అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచింది.

కాగా ఈ మూవీ యొక్క ట్రైలర్ ఫన్నీగా ఉండడంతో పాటు తనకు ఎంతో బాగా నచ్చిందని, అలానే టీమ్ కు తన తరపున ప్రత్యేకంగా బెస్ట్ విషెస్ తెలియచేస్తూ తాజాగా ట్వీట్ చేసారు సూపర్ స్టార్ మహేష్ బాబు. కాగా ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా మ్యాడ్ మూవీ అక్టోబర్ 6న ఆడియన్స్ ముందుకి రానుంది. భీమ్స్ సిసిలోరియో మ్యూజిక్ అందించిన ఈ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

https://x.com/urstrulyMahesh/status/1709517649577947297?s=20

సంబంధిత సమాచారం :