సక్సెస్ఫుల్ గా 17 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న మహేష్, త్రివిక్రమ్ ల బ్లాక్ బస్టర్ ‘అతడు’

సక్సెస్ఫుల్ గా 17 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న మహేష్, త్రివిక్రమ్ ల బ్లాక్ బస్టర్ ‘అతడు’

Published on Aug 11, 2022 12:30 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ అతడు. తొలిసారిగా వీరిద్దరూ కలిసి పనిచేసిన ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందించారు. జయభేరి అర్ట్స్ బ్యానర్ పై మురళీమోహన్ ఈ మూవీని ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన అతడు బ్లాక్ బస్టర్ సక్సెస్ తో హీరోగా మహేష్ కి, దర్శకుడిగా త్రివిక్రమ్ కి మరింత క్రేజ్ లభించింది.

ఇక ఇప్పటికీ కూడా ఈ మూవీ టివిల్లో ప్రసారం అయిన ప్రతిసారి మంచి టిఆర్పి రేటింగ్స్ ని దక్కించుకుంటూ ఉంటుంది. అలానే ఇందులోని డైలాగ్స్, సాంగ్స్, బిజీఎం, యాక్షన్, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ ని ఆడియన్స్ ఎప్పటీకీ మర్చిపోలేరు అనే చెప్పాలి. కాగా ఈ సూపర్ కాంబో మూవీ నిన్నటితో సక్సెస్ఫుల్ గా 17 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో పలువురు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ అతడు టీమ్ కి ప్రత్యేకంగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా గ్రీటింగ్స్ తెలియచేస్తున్నారు. కాగా అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో SSMB28 మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు