చిన్నారి మృతి పట్ల తీవ్ర ఆవేదనకు గురైన సూపర్ స్టార్

Rajinikanth3

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా నడుకుట్టుపట్టిలో రెండేళ్ల చిన్నారి సుర్జిత్ విల్సన్ బోరు బావిలో పడి మరణించిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం బాలుడు బావిలో పడిపోయిన విషయం తెలియడంతో సామాన్యులతో సహా తమిళ సినీ సెలబ్రిటీలు కూడా బాలుడు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థించారు. వారిలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారు.

కానీ వారి ప్రార్థనలు ఫలించలేదు. సుమారు 80 గంటల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం బాలుడు విగతజీవిగా బయటికొచ్చాడు. దీంతో పిల్లాడి తల్లిదండ్రులతో పాటు అతని క్షేమం కోరిన ప్రతి ఒక్కరు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రజనీకాంత్ అయితే సుర్జిత్ మరణం తనను ఎంతగానో కలచివేసిందని, బాలుడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అతని తల్లిదండ్రులకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. అలాగే మురుగదాస్, సమంత, వివేక్ ఒబెరాయ్, అట్లీ, జీవీ ప్రకాష కుమార్, లారెన్స్ లాంటి వాళ్లంతా సుర్జిత్ మరణం పట్ల తమ భాధను వ్యక్తం చేశారు.

Exit mobile version