‘సర్కార్’ ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా ఎవరు రానున్నారో తెలుసా !

తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న చిత్రం ‘సర్కార్’ ప్రస్తుతం పోస్ట్ ప్రోడుక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రం యొక్క ఆడియో విడుదల వేడుకను భారీ స్థాయిలో నిర్వహించనున్నారు. ఈవేడుకకు చెన్నై లోని క్రికెట్ స్టేడియం చేపాక్ వేదిక కానుంది. ప్రస్తుతం పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక వేళా స్టేడియం లో పర్మిషన్ దొరకకపోతే నెహ్రు ఇండోర్ స్టేడియంలో కానీ లేక వై ఎమ్ సి ఏ స్టేడియం లో ఈ వేడుకను జరుపనున్నారు.

ఇక ఈ వేడుకకు ముఖ్య అతిధిగా సూపర్ స్టార్ రజినీ కాంత్ హాజరు కానున్నారు. అక్టోబర్ 2న ఈ ఆడియో విడుదల వేడుక జరుగనుంది. మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలకానుంది.