‘ఘాజి’ కి వెల్లువెత్తుతున్న ప్రముఖుల ప్రసంశలు !


నూతన దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో హీరో రానా దగ్గుబాటి నటించిన చిత్రం ‘ఘాజి’. నిన్నటి నుండి పలు ప్రధాన నగరాల్లో ఈ చిత్రం యొక్క ప్రీమియర్ షోలను ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో తెలుగు వెర్షన్ ప్రీమియర్ ను ఈరోజు ఉదయం హైదరాబాద్లో ప్రదర్శించారు. చిత్రం చూసిన వాళ్లంతా సినిమాను చాలా బాగావుంది మెచ్చుకుంటున్నారు. హీరో హీరోయిన్లు, దర్శకులైతే మంచి ప్రయత్నం చేసినందుకు రానా, సంకల్ప్ రెడ్డిలను, సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు.

ముఖ్యంగా హీరోలు నాగ చైతన్య, సుమంత్, నిఖిల్ సిద్దార్థ, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి, దర్శకులు, క్రిష్, మారుతి లు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సినిమా చాలా బాగుందని, తెలుగువారు గర్వించదగిన సినిమా చేశారని, తెలియని చరిత్రను గొప్పగా చూపారని టీమ్ ను అభినందిస్తున్నారు. విమర్శకుల నుండి కూడా చిత్రానికి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది.