ప్రస్తుత తెలుగు సినిమాపై జస్టిస్ ఎన్ వి రమణ కీలక కామెంట్స్.!

Published on May 14, 2022 9:01 am IST

ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా తెలుగు సినిమా స్థానం ఉందో తెలిసిందే. పలు భారీ చిత్రాలు తెలుగు సినిమాలను భారీ వసూళ్లు మరియు ఆదరణతో ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకొస్తున్నాయి. అయితే అన్ని సినిమాలు కూడా అలాగే ఉన్నాయని చెప్పడానికి లేదు గాని తాజాగా భారత దేశ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ పలు కీలక కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది.

లెజెండరీ దర్శకుడు కే రాఘవేంద్రరావు రాసిన “నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ” అనే పుస్తక ఆవిష్కరణ సందర్భంగా తాను ప్రస్తుత తెలుగు సినిమాపై కీలక కామెంట్స్ చేసారు. ప్రస్తుతం తెలుగు సినిమాలో స్వల్ప కాలిక వినోదం మాత్రమే అందిస్తున్నాయని ఇప్పుడు తెలుగు సినిమాలు చూస్తూ తెలుగులో సబ్ టైటిల్స్ చదివి అర్ధం డైలాగ్స్ అర్ధం చేసుకునే దయనీయ స్థితికి తెలుగు సినిమాని నెట్టొద్దని ఆయన కోరారని వ్యాఖ్యలు చెయ్యడం ఇపుడు ఆసక్తిగా మారింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :