బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు.. అసలేం జరిగింది అంటే ?

బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు.. అసలేం జరిగింది అంటే ?

Published on Aug 30, 2022 3:00 AM IST

నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పైగా ఎప్పుడో రిలీజ్ అయి హిట్ అయిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు గానూ బాలయ్య పై ఇప్పుడు నోటీసులు జారీ అయ్యాయి. అసలేం జరిగింది అంటే.. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకి ప్రభుత్వాలు పన్ను రాయితీ ఇచ్చాయి. అయినా.. టికెట్ రేటు తగ్గించలేదట. ఈ నేపథ్యంలో సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం కోర్టులో ఒక పిటిషన్ వేసింది.

పన్ను రాయితీ ప్రయోజనాలను సినీ ప్రేక్షకులకు బదలాయించలేదని ఆ పిటిషన్ లో పేర్కొంది. పైగా పన్ను రాయితీ రూపంలో వచ్చిన డబ్బును తిరిగి ప్రభుత్వం రికవరీ చేయాలని కూడా ఆ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఆ పిటిషన్‌ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్ర చూడ్ ధర్మాసనం విచారించి.. తాజాగా నోటీసులు జారీ చేసింది. బాలయ్యతో పాటు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు