పవన్ని అలా చూశాక నాకు కన్నీళ్లు ఆగలేదు – సుప్రియ

అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొదటి హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు గుర్తు ఉండిపోయారు సుప్రియ యార్లగడ్డ. దాదాపు 22 సంవత్సరాల తరువాత సుప్రియ ‘గూఢచారి’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

వివరాల్లోకి వెళ్తే సుప్రియ మాట్లాడుతూ ‘‘పవన్ కళ్యాణ్ జెంటిల్‌ మేన్ అని, ఆయన మొదటి సినిమా చేస్తున్న సమయంలో తెగ సిగ్గుపడిపోతూ ఉండేవారని, మొదటి సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారని చెప్పుకొచ్చారు. పవన్ నిజంగానే చేతులపై కార్లు ఎక్కించుకున్నప్పుడు, ఛాతీపై రాళ్లు పగలకొట్టించుకున్నప్పుడు అది చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు అని సుప్రియ యార్లగడ్డ తెలిపారు.