డిసెంబ‌ర్ 30న రిలీజ్ అవుతున్న మా ‘లక్కీ లక్ష్మణ్’ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసేలా ఉంటుంది – టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సోహైల్

డిసెంబ‌ర్ 30న రిలీజ్ అవుతున్న మా ‘లక్కీ లక్ష్మణ్’ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసేలా ఉంటుంది – టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సోహైల్

Published on Dec 3, 2022 10:07 AM IST


బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహెల్ ర్యాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లక్కీ లక్ష్మణ్. యువ నటి మోక్ష హీరోయిన్ గా న‌టిస్తోన్న ఈ సినిమా ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై రూపొందుతుండగా ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వం వహిస్తున్నారు. హ‌రిత గోగినేని నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 30న సినిమా రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్బంగా శ‌నివారం మూవీ యూనిట్ ఫస్ట్ లుక్ టీజ‌ర్‌ను హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో సోహైల్‌, నిర్మాత హ‌రిత గోగినేని, ద‌ర్శ‌క‌డు అభి, బిగ్ బాస్ మెహ‌బూబ్‌, అఖిల్ సార్థ‌క్‌, స‌న్నీ త‌దిత‌రులు పాల్గొన్నారు. టిప్స్ మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరో సోహెల్ మాట్లాడుతూ, ఈరోజు మా మూవీ టీజర్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే నిజంగా ఎంతో ఆనందంగా అంది, మనం కోరితే ఇండస్ట్రీ నుండి పలువురు వస్తారు, మరికొందరు రారు. ఇక వచ్చిన వారిలో కొందరు మనస్ఫూర్తిగా మాట్లాడరు, కానీ అభిమానులు అలా కాదు మనకు విజయం, అపజయం ఏది లభించినా మన వెంటే ఉంటూ మనకి ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటారని ఎమోషనల్ గా మాట్లాడుతూ చెప్పారు.

ఇక బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తరువాత తాను హీరోగా వస్తున్న ఫస్ట్ మూవీ లక్కీ లక్ష్మణ్ అని, దర్శకడు అభి గారు మూవీ ని ఎంతో కష్టపడి యువత,మాస్, ఫ్యామిలీస్ ఇలా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా అద్భుతంగా తీసారని అన్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ మొత్తం ఎంతో హ్యాపీ గా ఎంజాయ్ చేసే సినిమా లక్కీ లక్ష్మణ్ అని అన్నారు. తనకు బెక్కెం వేణుగోపాల్ గారు ఎంతో సపోర్ట్ చేసారని, ప్రొడ్యూసర్ హరిత గారికి ఎంతో గట్స్ ఉన్నాయని, ఇందరు మంచి వారితో కలిసి చేసిన ఈ మూవీ మీ అందరినీ తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం తనకు ఉందని ఆశాభావం వక్తం చేశారు. బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, మాకంటే ఆలస్యంగా సినిమాని స్టార్ట్ చేసినప్పటికీ కూడా హరిత గారు లక్కీ లక్ష్మణ్ మూవీని రిలీజ్ కి సిద్ధం చేయడం ఆనందంగా ఉందన్నారు. బిగ్ బాస్ కంటే ముందే తనకు సోహెల్ తెలుసునని, అటువంటి మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులు తప్పకుండా భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకుంటారని తెలిపారు.

ఇక ఈ మూవీని డైరెక్టర్ అభి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని టెక్నీకల్ గా గాని, క్వాలిటీ పరంగా గాని మూవీ ఎంతో బాగా వచ్చిందని, తప్పకుండా డిసెంబర్ 30న రిలీజ్ తరువాత లక్కీ లక్ష్మణ్ అందరి అంచనాలు అందుకుంటుందని నమ్ముతున్నాను అన్నారు. డైరెక్టర్ ఏ ఆర్ అభి మాట్లాడుతూ, నిజానికి ఈ మూవీ మేకింగ్ సమయంలో అందరం మంచి క్వాలిటీ అవుట్ ఫుట్ కోసం ఒకింత గొడవపడ్డాం అన్నారు. అయితే ఫైనల్ గా మూవీ అనుకున్న విధంగా అద్భుతంగా వచ్చినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. త్వరలో ట్రైలర్ తో పాటు రెండు పాటలు కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నాం అని, రేపు సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ మంచి స్మైల్ తో బయటకు వస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. హీరో సోహెల్ అద్భుతంగా యాక్ట్ చేసారని, నిర్మాత హరిత మంచి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అని అన్నారు. ఈ సినిమా కి వర్క్ చేసిన అనూప్ గారికి, ప్రవీణ్ పూడి గారికి, అందరూ గారికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు అభి. దేవీ ప్ర‌సాద్‌, రాజా ర‌వీంద్ర‌, స‌మీర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, షాని త‌దిత‌రులు ఈమూవీలో ఇతర పాత్రలు చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు