పూనకాలు లోడింగ్ సాంగ్ కి రేపు థియేటర్స్ లో పూనకాలే – డైరెక్టర్ బాబీ

పూనకాలు లోడింగ్ సాంగ్ కి రేపు థియేటర్స్ లో పూనకాలే – డైరెక్టర్ బాబీ

Published on Dec 31, 2022 1:27 AM IST

మెగాస్టార్ చిరంజీవితో తొలిసారిగా యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న భారీ స్థాయిలో రిలీజ్ కానున్న వాల్తేరు వీరయ్య నుండి ఇటీవల రిలీజ్ అయిన మూడు సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచగా నేడు మెగా మాస్ సాంగ్ అయిన పూనకాలు లోడింగ్ సాంగ్ ని కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని సంధ్య 70 ఎం ఎం థియేటర్ లో గ్రాండ్ గా ఫ్యాన్స్ మధ్యన రిలీజ్ చేసారు మేకర్స్. కాగా ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ కి డైరెక్టర్ బాబీతో పాటు శ్రీనివాస రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్, కోనవెంకట్ సహా నిర్మాతలు కూడా పాల్గొన్నారు.

మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా డ్యాన్స్ అదరగొట్టిన ఈ సాంగ్ ని రామ్ మిరియాల, దేవిశ్రీప్రసాద్, డైరెక్టర్ బాబీ తో పాటు చిరంజీవి, రవితేజ కూడా పాడడం విశేషం. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ, ఈ సాంగ్ ఇప్పుడే ఇలా ఉంటె రేపు థియేటర్స్ లో మూవీ రిలీజ్ అయ్యాక మీ అందరికీ పూనకాలు రావడం ఖయాం అని, మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా పెరిగిన తనకు ఈ సినిమా ద్వారా ఆయనని దర్శకత్వం వహించే అవకాశం రావడం తన అదృష్టం అని, మెగా ఫ్యాన్స్ అందరూ అన్నయ్యని ఎలా చూడాలని అనుకుంటున్నారో, అదే విధంగా అందరినీ మెప్పించేలా శక్తివంచన లేకుండా సినిమా తీశానని, తప్పకుండా ఆడియన్స్ కి కూడా ఈ మూవీ నచ్చుతుందనే నమ్మకాన్ని బాబీ వ్యక్తం చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు