ఇంటర్వ్యూ : కీర్తి సురేష్ – ‘దసరా’ లో వెన్నెల పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది

ఇంటర్వ్యూ : కీర్తి సురేష్ – ‘దసరా’ లో వెన్నెల పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది

Published on Mar 26, 2023 2:00 AM IST

నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ దాసరా. మార్చి 30న పలు భాషల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో నిర్మితం అయిన ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని ఆకట్టుకుని ఆడియన్స్ లో మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి. ఇక నేడు ఈ మూవీ యొక్క అనుభవాలని మీడియాతో పంచుకున్న కీర్తి సురేష్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం.

 

దసరాలో మీ పాత్ర సవాల్ తో కూడుకున్నదిగా అనిపిస్తోంది, మీ పాత్ర గురించి చెప్పండి ?
దసరాలో సవాల్ తో కూడుకున్న పాత్ర చేశా. మేకప్ వేయడానికి, తీయడానికి కూడా కొన్ని గంటలు పట్టేది. దుమ్ము , బొగ్గు ఇలా రస్టిక్ బ్యాగ్ డ్రాప్ లో షూట్ చేశాం. మేకప్ తీసి మళ్ళీ మామూలు స్థితికి రావడానికి చాల సమయం పట్టేది. తెలంగాణ యాస మాట్లాడే పాత్ర. మొదట కష్టం అనిపించిది. తర్వాత అలవాటైపోయింది. ఇందులో నా పాత్ర పేరు వెన్నెల. నా కెరీర్ లో పోషించిన ఓ ఛాలెజింగ్ రోల్ ఇది. వెన్నెల అనే పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది. డబ్బింగ్ నేనే చెప్పుకున్నాను, అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది.

 

దసరా చేస్తున్నుడు మహానటి వైబ్స్ వచ్చాయని అన్నారు, ఏ రకంగా మహానటి గుర్తు వచ్చింది?
ఒక సినిమాతో ఒక ఫీల్ వుంటుంది. సినిమా పూర్తి చేసిన తర్వాత కూడా దానితో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఫీలౌతాం. అది మహానటికి వుండేది. ఇప్పుడు దసరాకి వచ్చింది. తప్పకుండా ఈ పాత్ర ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి కనెక్ట్ అవుతుంది.

 

తెలంగాణ యాస మాట్లాడటం ఎలా అనిపించింది ?
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అసోషియేట్ శ్రీనాథ్ నాకు తెలంగాణ యాస నేర్పించారు. ఆయనకి మొత్తం యాస మీద పట్టుంది. అలాగే ఒక ప్రోఫెషర్ కూడా వున్నారు. చాలా చిన్న చిన్న వివరాలు కూడా యాడ్ చేశారు. దసరాకి నేనే డబ్బింగ్ చెప్పా. మాములుగా అయితే రెండు లేదా మూడు రోజులు డబ్బింగ్ చెబుతా. కానీ దసరాకి మాత్రం ఐదారురోజులు పట్టింది. మొత్తంగా అయితే చాలా బాగా అనిపించింది, తప్పకుండా అందరికీ నచుతుంది.

 

మహానటి కి జాతీయ అవార్డ్ వచ్చింది కదా మరి దసరాకి కూడా వస్తుందని భావిస్తున్నారా ?
నిజానికి నేనేం ఆశించడం లేదండీ. మహానటి కి కూడ నేను ఆశించలేదు. అందరి బ్లెసింగ్స్ తో వచ్చింది. సినిమా బాగా ఆడాలి, అందరూ వారి బెస్ట్ వర్క్ ని ఇవ్వాలని మాత్రమే అనుకుంటాను.

 

దసరాకి ఎలాంటి హోం వర్క్ చేశారు?
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ కథని అద్భుతంగా రాసుకున్నారు. ఏ పాత్ర ఎలా ఉండాలో అయనకి చాలా క్లారిటీ వుంది. దర్శకుడు పాత్ర, కథని ఒక మీటర్ లో అనుకుంటారు. ఆ మీటర్ ని అర్ధం చేసుకున్న తర్వాత నేను ఎలా చేయాలనిఅనుకుంటున్నాను. దర్శకుడు ఏం కోరుకుంటున్నారు అనేది మనం అర్ధం చేసుకొని క్యారెక్టర్ ని ఎలా బిల్డ్ చేయాలనే దానిపై వర్క్ చేశాం. మొత్తంగా ఔట్ పుట్ అందరికీ నచ్చడంతో సినిమా మీద కూడా బాగా నమ్మకం వచ్చింది.

 

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గురించి ?
శ్రీకాంత్ ఎక్స్ లెంట్ డైరెక్టర్. తన వర్క్ చూస్తే మొదటి సినిమా చేస్తున్న దర్శకుడిలా అనిపించలేదు. తనకి చాలా క్లారిటీ వుంది. ఇండస్ట్రీ కి శ్రీకాంత్ లాంటి దర్శకుడు రావడం ఆనందంగా వుంది. ఈ సినిమా అతడికి బాగా పేరు తీసుకువస్తుంది. అలానే భవిష్యత్ లో తను అద్భుతమైన చిత్రాలని అందిస్తాడు.

 

నేను లోకల్ తర్వాత నాని గారితో పని చేయడం ఎలా అనిపించిది ?
నాని గారితో నేను లోకల్ తర్వాత ఇలాంటి పాత్ర కోసం చాలా వెయిట్ చేసి చేసిన సినిమా దసరా. ఆయనతో చాలా కాలం తర్వాత కలసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. వెన్నెల చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇలాంటి కథ కోసం చాలా కాలంగా ఎదురుచూశాను. మరొక్కసారి మా కాంబోలో హిట్ రాబోతుందని నమ్ముతున్నాను.

 

చమ్కీల అంగీలేసుకొని పాట చాలా పాపులర్ అయ్యింది కదా, ఇంత పాపులర్ అవుతుందని ముందే అనుకున్నారా ?
ఆ పాట వినగానే అన్ని పెళ్లిల్లో ఇదే పాట మారుమ్రోగుతుందని అనుకున్నాం. పాటలో ఆ వైబ్ వుంది. లిరిక్స్ చాలా అందంగా వుంటాయి. అప్పుడే పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాం. మేము ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధించింది. ఆదరిస్తున్న ఆడియన్స్, ఫ్యాన్స్ అందరికి స్పెషల్ థాంక్స్ మహానటి తర్వాత మీరు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేస్తారాని వార్తలు వచ్చాయి. కానీ మీరు వెళ్ళలేదు. దసరా ఇప్పుడు పాన్ ఇండియా

విడుదల అవుతుంది కదా మరి వెళ్తారా ?
కొన్ని కథలు విన్నాను. కానీ బలమైన పాత్ర అనిపించలేదు. ఇప్పుడు దసరా పాన్ ఇండియా విడుదలౌతుంది కాబట్టి బలమైన పాత్రలు వస్తాయో చూడాలి. నాకు మాత్రం చేయాలనే వుంది. అయితే ముందు మంచి పాత్రలు, కథలు కుదరాలి. అన్ని సెట్ అయితే అక్కడ తప్పకుండా చేస్తాను.

ఆల్ ది బెస్ట్ థాంక్యూ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు