పవన్ తో సాలిడ్ బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేసినట్టున్న సురేందర్ రెడ్డి!

Published on Sep 2, 2021 5:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలతో సోషల్ మీడియా అంతా కూడా షేక్ అవుతుంది. మరి ఈ స్పెషల్ డే న పవన్ కొత్త ప్రాజెక్ట్ లు షూట్ లో చిత్రాలు నుంచి సాలిడ్ అప్డేట్స్ కూడా వచ్చాయి. మరి వాటిలో మన టాలీవుడ్ మాస్ అండ్ స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డితో ప్లాన్ చేసిన సినిమా నుంచి వచ్చిన అప్డేట్ కూడా ఉంది.

అయితే పెద్దగా డీటెయిల్స్ రివీల్ చెయ్యలేదు కానీ ఒక కాన్సెప్ట్ పోస్టర్ లాంటిది డిజైన్ చేసారు. హైదరాబాద్ విజువల్స్ లో పైన గన్ తో “యథా కాలం తథా వ్యవహారం” అనే లైన్ ని కూడా పెట్టి తమ టీం నుంచి విషెష్ తెలిపారు. మరి ఇదంతా చూస్తుంటే బ్యాక్ డ్రాప్ ని ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నారని చెప్పాలి. మరి ఈ చిత్రానికి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ కథ అందిస్తుండగా రామ్ తాళ్లూరి నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :