ఈ శుక్రవారం మూడు సినిమాలకు మంచిదికాదట !
Published on Aug 6, 2017 3:56 pm IST


ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు భారీ స్థాయి పోటీ నెలకొననుంది. ఎందుకంటే విడుదలకానున్న ‘నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక, లై’ మూడు టాప్ సినిమాలే కాబట్టి. పైగా మూడింటిపైనా బోలెడంత పాజిటివ్ క్రేజే ఉంది. దీంతో ఏ సినిమా ఏ స్థాయిలో ఆడుతుందో, ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో ఎవరూ చెప్పలేకున్నారు. ఒకరకంగా ఇది మూడు సినిమాలకి నష్టం చేకూర్చే వోషయనే చెప్పాలి.

ఇదే విషయాన్ని సీనియర్ నిర్మాత సురేష్ బాబు కూడా ప్రస్తావించారు. ఇలా మూడు సినిమాలు ఒకేసారి రావడం కలెక్షన్ల పరంగా మంచిదికాదన్న ఆయన ముందుగా తమిళంలో అజిత్ ‘వివేగం’ ఆగస్ట్ 11న వస్తొందని రానా సినిమాను వాయిదావేద్దామని అనుకున్నాం. కానీ వివేగం వాయిదాపడటంతో సినిమాకు తమిళంలో సోలో రిలీజ్ దొరుకుతోంది కానుంక 11నే రావాల్సి వస్తోంది’ అన్నారు. మరి ఈ శుక్రవారం మూడింటిలో ఏ సినిమా ఎక్కువ స్థాయిలో మెప్పించి విజేతగా నిలబడుతుందో చూడాలి.

 
Like us on Facebook