నటుడు సురేష్ గోపీకి కోవిడ్-19 పాజిటివ్

Published on Jan 19, 2022 5:12 pm IST


మమ్ముట్టి తర్వాత మరో మలయాళ స్టార్ హీరో ఈరోజు కరోనావైరస్ బారిన పడ్డారు. నటుడు సురేష్ గోపీ తనకు కోవిడ్-19 సోకినట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, కోవిడ్ -19 భారిన పడినట్లు చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం తను బాగానే ఉన్నట్లు తెలిపారు. అంతేకాక ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు. అందరూ కూడా మాస్కులు ధరించి, బహిరంగ ప్రదేశాల్లో సామాజిక దూరం పాటించడం ద్వారా సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు. వర్క్ ఫ్రంట్‌లో, నటుడు జోషి దర్శకత్వం వహించిన పాపన్ అనే పరిశోధనాత్మక డ్రామా షూటింగ్‌ను ఇటీవలే ముగించాడు.

సంబంధిత సమాచారం :