మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సురేష్ ప్రొడక్షన్స్..!

Published on Jul 27, 2021 8:58 pm IST

“నారప్ప” మూవీతో సురేష్ ప్రొడక్షన్స్ తొలిసారి మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ మ్యూజిక్ కంపెనీగా పేరు తెచ్చుకున్న పారిస్‌కు చెందిన ‘బిలీవ్’ కంపెనీతో సురేశ్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ (ఎస్పీ మ్యూజిక్) జత కట్టింది. వీరి భాగస్వామ్యంలో నారప్ప సినిమా సంగీతాన్ని వరల్డ్ మ్యూజిక్ డయాస్‌పై బిలీవ్ సంస్థ ప్రమోట్ చేయనుంది. దీనిపై సురేశ్ ప్రొడక్షన్స్ ఎండీ సురేష్ బాబు మాట్లాడుతూ బిలీవ్‌ సంస్థతో భాగస్వామి అవడం గొప్ప అవకాశమని, బిలీవ్‌ వంటి విస్తృతమైన పంపిణీ నెట్‌వర్క్‌తో ఎస్‌పీ మ్యూజిక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతప్రియులకు చేరువవుతుందని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. నారప్ప మా మొదటి ప్రాజెక్ట్ అని మా భాగస్వామ్యం మరెన్నో చిత్రాలకు కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు.

బిలీవ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ రైనా కూడా మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో దిగ్గజ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీలలో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్‌తో భాగస్వామి అవ్వడం ఎగ్జైటింగ్‌గా ఉందని, నారప్ప వంటి మంచి సినిమాతొ తమ జర్నీ స్టార్ట్ చేయడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :