ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టెప్ వేసిన క్రికెటర్ సురేష్ రైనా

Published on Jan 23, 2022 6:58 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రైజ్. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం లోని అల్లు అర్జున్ డాన్స్ కి మరియు అతని స్టైల్ కి అభిమానుల పెరుగుతూనే ఉన్నారు.

ఈ చిత్రం లో శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్ వేసిన స్టెప్ కు రీల్స్ రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టెప్ వేశారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. రష్మీక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం రెండవ భాగం పుష్ప ది రూల్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :