“సూర్య 42” లో వారికి అవకాశం..!

Published on Feb 11, 2023 7:04 am IST

తమిళ్ నుంచి ఉన్న స్టార్ హీరోల్లో మన తెలుగు లో కూడా మంచి స్టార్డం ఉన్న హీరో సూర్య కూడా ఒకరు. మరి ఇప్పుడు సూర్య హీరోగా తన కెరీర్ లో 42వ సినిమా ని దర్శకుడు శివ తో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సూర్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ఇది. మరి దీనిపై కూడా అంతే హైప్ నెలకొనగా షూటింగ్ కూడా శరవేగంగా మేకర్స్ కంప్లీట్ చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా లో నటించే అవకాశాన్ని ఇప్పుడు మేకర్స్ కొందరికి కలిగించారు. 25 నుంచి 55 ఏళ్ల మధ్యలో దేహ దారుఢ్యం కలిగి ఉన్నవారు అందులో మంచి గడ్డం కలిగి ఉన్నవారు ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉందని వారికి ఆహ్వానించారు. ప్రస్తుతం వారు ఎలా ఉన్నారో ఫోటోగ్రాఫ్ లను అయితే తమ మెయిల్ కి పంపాలని సూచించారు.

మరి సూర్య అభిమానుల్లో అలాంటి వారు ఉన్నా ఈ లక్షణాలు ఉండి సినిమా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారు అయిన ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పాలి. మరి దీనితో అయితే మరో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని గాని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే గ్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :