సూర్య బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రిలీజ్ అప్పుడే..!

సూర్య బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రిలీజ్ అప్పుడే..!

Published on Oct 29, 2022 10:00 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ చిత్రం తన 42వ ప్రాజెక్ట్ అని చెప్పాలి. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఓ పీరియాడిక్ డ్రామాగా ప్లాన్ చెయ్యగా దీని నుంచి వచ్చిన మోషన్ పోస్టర్ టీజర్ కి అయితే సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ చిత్రాన్ని అయితే మేకర్స్ షూటింగ్ శరవేగంగా తెరకెక్కిస్తుండగా సినిమా రిలీజ్ అప్పుడు అనే అంశం ఇప్పుడు తెలుస్తుంది.

మరి తమిళ సినీ వర్గాలు చెప్తున లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్ చెయ్యడం సాధ్యం కాదట. డెఫినెట్ గా 2024 లో ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని తెలుస్తుంది. ఈ సినిమాపై మాత్రం ఎనలేని హైప్ ఇప్పుడు ఉంది. మరి ఈ చిత్రంలో అయితే దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మేకర్స్ఈ చిత్రాన్ని 3D లో రిలీజ్ ప్లాన్ చేస్తుండగా ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు