ఈ హిందీ చిత్రం పై సూర్య ప్రశంశలు

Published on Mar 17, 2023 12:23 am IST


Mrs. ఛటర్జీ Vs నార్వే అనే హిందీ చిత్రం మార్చ్ 17, 2023 న తెరపైకి వస్తోంది. రాణి ముఖర్జీ టైటిల్ రోల్‌లో నటించిన ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రిలీజైన ఈ చిత్రం ట్రైలర్ చాలా మందిని ఆకట్టుకుంది. తమిళ నటుడు సూర్య ఇప్పుడు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాని ముందుగానే చూసిన నటుడు బరువెక్కిన హృదయంతో బయటకు వచ్చానని, ఇంకా ఆలోచనల్లో కూరుకుపోయానని చెప్పుకొచ్చారు.

ఒక నిజమైన సంఘటన గురించిన ముఖ్యమైన చిత్రం అని సూర్య రాశారు. జాతీయ అవార్డు గెలుచుకున్న రాణి ముఖర్జీని మరియు మొత్తం టీమ్‌ను అభినందించారు. వారికి గొప్ప విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు. అషిమా చుబ్బర్ ఈ Mrs ఛటర్జీ Vs. నార్వే కి దర్శకత్వం వహించారు. ఈ లీగల్ డ్రామా థియేటర్లలో ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :