కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన ఫిల్మోగ్రఫీ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలు సూర్య ఇప్పుడు వరకు చేస్తూ వచ్చి తమిళ్ సహా తెలుగు ఆడియెన్స్ కి అలరిస్తూ వచ్చారు. మరి ఇప్పుడు భారీ పాన్ ఇండియా చిత్రం “కంగువా” తో తాను వస్తుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో సూర్య చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
మరి ఈ కామెంట్స్ లో భాగంగా తన నుంచి రానున్న క్రేజీ ప్రాజెక్ట్ “రోలెక్స్” పై చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి. రోలెక్స్ సినిమాకి ఇది వరకే తాను చేసిన మరో సినిమాకి కనెక్షన్ ఉంది అని సూర్య రివీల్ చేశారు. అయితే తనది మరో సినిమా అంటే ఖచ్చితంగా “విక్రమ్” అయితే కాదు అని చెప్పొచ్చు. మరి ఆ సినిమా ఏంటి రోలెక్స్ తో ఎలా సంబంధం కుదిరింది అనేది లోకేష్ కనగరాజ్ సూర్యకే తెలియాలి. మరి సూర్య చేసిన గత చిత్రాల్లో డ్రగ్స్ రిలేటెడ్ సినిమాలు కొన్ని ఉన్నాయి. మరి వాటితో ఏమన్నా కనెక్షన్ ఉందా అనేది వేచి చూడాలి.