‘సూర్య – బాలా’ సినిమాలో రాయలసీమ నేపథ్యం !

‘సూర్య – బాలా’ సినిమాలో రాయలసీమ నేపథ్యం !

Published on Jul 4, 2022 11:00 PM IST

తమిళ స్టార్ హీరో సూర్య తన తదుపరి సినిమాని స్టార్ డైరెక్ట‌ర్ బాలాతో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో రాయలసీమ నేపథ్యం తాలూకు ఎపిసోడ్ కూడా ఉంటుందట. ఈ ఎపిసోడ్ సినిమా మొత్తంలోనే స్పెషల్ గా ఉంటుందని తెలుస్తోంది. అందుకే.. ఈ ఎపిసోడ్ షూట్ కోసం చిత్రబృందం త్వరలోనే కర్నూలులో షూటింగ్ ను ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో సూర్య పాత్ర కూడా చాలా వైవిధ్యంగా ఉంటుందట.

ఇక సూర్య కోసం బాలా మంచి డెప్త్ ఉన్న కథ రాశాడని.. సూర్య కెరీర్ లోనే ఈ చిత్రం స్పెషల్ గా ఉండబోతుంది అని తెలుస్తోంది. సూర్య 41వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఐశ్వర్య రాజేష్ పాత్రకు రాయలసీమ ఎపిసోడ్ కు లింక్ ఉంటుందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు