ప్రభుత్వం పై స్టార్ హీరో సీరియస్

ప్రభుత్వం పై స్టార్ హీరో సీరియస్

Published on Jun 24, 2024 4:01 PM IST

తమిళనాడులో కల్తీసారా తాగి 51 మంది మరణించిన ఘటన గురించి తెలిసిందే. ఈ ఘటన పై సినీ, రాజకీయ ప్రముఖులు.. ప్రభుత్వ తీరుపై మండిపడుతూ పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా స్టార్ హీరో సూర్య కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఒక చిన్న పట్టణంలో వరుసగా 50 మంది చనిపోవడం తుఫానులు, వర్షాలు, వరదలు వంటి విపత్తుల సమయంలో కూడా జరగని విషాదం. ఇంకా వంద మందికి పైగా ఆస్పత్రిలోనే ఉండడం కలకలం రేపుతోంది. వరుస మరణాలు, బాధితుల రోదనలు హృదయాన్ని కలచి వేస్తున్నాయి. గతేడాది విల్లుపురం జిల్లాలో మిథనాల్ కలిపిన నకిలీ మద్యం తాగి 22 మంది చనిపోయారు.

అప్పుడు కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు మరో జిల్లాలో కూడా అదే మిథనాల్ కలిపిన కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోయడం దారుణం’ అంటూ సూర్య తన పోస్ట్ లో రాసుకొచ్చాడు. తమిళనాడులో కల్తీ మద్యం విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు రాకపోవడం చాలా బాధాకరం. అక్రమ మద్యం విక్రయాలను అరికట్టడంలో విఫలమైన పరిపాలనను తీవ్రంగా ఖండిస్తున్నా’ అంటూ సూర్య చెప్పాడు. ‘ ఇక మీదట కొత్త చట్టం చేద్దాం. మేము దానిని ఎప్పటికీ రక్షిస్తాము’ అంటూ ఓ స్లోగన్‌ను తన లేఖ చివర్లో సూర్య రాసుకొచ్చారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలు సూర్యకి ఉన్నాయని.. అందుకే సూర్య ఇలా పోస్ట్ పెట్టాడు అంటూ ఫ్యాన్స్ మెసేజ్ లు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు