“RRR” టీం కి సూర్య స్పెషల్ కంగ్రాట్స్.!

“RRR” టీం కి సూర్య స్పెషల్ కంగ్రాట్స్.!

Published on Feb 26, 2023 8:00 AM IST

ప్రస్తుతం వరల్డ్ సినిమా దగ్గర ఎంతగానో వినిపిస్తున్న మన భారతీయ సినిమా పేరు “RRR” దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో తెరకెక్కించిన ఈ భారీ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ ప్రేక్షకుల్లో ముద్ర వేసింది. ఇక పలు హాలీవుడ్ అవార్డ్స్ నెగ్గుతూ దేశానికి గర్వ కారణంగా నిలుస్తున్న ఈ సినిమాపై మరియు చిత్ర యూనిట్ పై ఇతర బిగ్ స్టార్స్ అయితే ప్రశంసలు కురిపిస్తున్నారు.

మన దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించగా కోలీవుడ్ నుంచి స్టార్ హీరో సూర్య రౌద్రం రణం రుధిరం టీం కి తన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ లో RRR కి పలు అవార్డ్స్ రావడం ఎంతో సంతోషంగా ఉందని ఈ గుర్తింపు కి ఇంత సంతోషానికి మీరు అర్హులు అని దర్శకుడు రాజమౌళి సంగీత దర్శకుడు కీరవాణి అలాగే నటుడు ఎన్టీఆర్ కి కంగ్రాట్స్ తెలిపారు. అలాగే మన దేశం తరపున రిప్రెజెంటర్ గా ఉన్నందుకు చరణ్ ని చూసి మరింత గర్వంగా ఉందని సూర్య సంతోషం వ్యక్తం చేశారు. దీనితో తెలుగు ఆడియెన్స్ సూర్య గెస్చర్ తో మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు