‘రెట్రో’తో తెలుగు మార్కెట్‌పై కన్నేసిన సూర్య

‘రెట్రో’తో తెలుగు మార్కెట్‌పై కన్నేసిన సూర్య

Published on Feb 11, 2025 6:00 PM IST

తమిళ స్టార్ హీరో సూర్య నటించే ప్రతి సినిమాని తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఆయనకు టాలీవుడ్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సూర్య సినిమాలను ఇక్కడ మంచి బజ్‌తో రిలీజ్ చేస్తారు. అయితే, గత కొంత కాలంగా సూర్య నటించిన ఏ సినిమా కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.

దీంతో ఈసారి తెలుగు మార్కెట్‌పై సూర్య ఫోకస్ పెంచినట్లుగా తెలుస్తోంది. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక కార్తీక్ సుబ్బరాజ్‌కి కూడా తెలుగునాట మంచి క్రేజ్ ఉంది. దీంతో రెట్రో చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ విషయంలో చిత్ర యూనిట్ ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం సూర్య స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నాడని.. తెలుగు భాషను ఈసారి మరింత పర్ఫెక్ట్‌గా మాట్లాడేందుకు ఆయన కష్టపడుతున్నాడట. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను కూడా తెలుగులో భారీగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఈ సినిమాతో టాలీవుడ్‌లో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని సూర్య ప్లా్న్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మే 1న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయిన ‘రెట్రో’ తెలుగు మార్కెట్‌లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు