‘సింగం 3’ని పూర్తి చేసిన సూర్య!
Published on Oct 25, 2016 10:51 pm IST

suriya
తమిళ స్టార్ హీరో సూర్య తన ఇమేజ్‌కి తగ్గ ఓ బలమైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈమధ్యే విడుదలైన ’24’ తెలుగు, తమిళ భాషల్లో మంచి హిట్‌గానే నిలిచినా, సూర్య స్థాయికి తగ్గ మాస్ విజయంగా మాత్రం నిలవలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన తన కొత్త సినిమా సింగం 3ని ఔట్ అండ్ ఔట్ మాస్ సినిమాగా సిద్ధం చేసేస్తున్నారు. డిసెంబర్ నెలలో విడుదల కానున్న ఈ సినిమా నేటితో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. సింగం, సింగం 2 సినిమాల తరహాలోనే ఈ సిరీస్‌లో మూడో సినిమాగా తెరకెక్కనున్న సింగం 3 నిలుస్తుందట.

హరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుష్క, శృతి హాసన్‍లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎక్కువగా మలేషియా నేపథ్యంలో సినిమా నడుస్తుందట. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా వెంటనే మొదలుపెట్టేసి భారీ ఎత్తున ప్రమోషన్స్ చేపట్టాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

 
Like us on Facebook