సూర్య గ్యాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

సూర్య హీరోగా వేగ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ‘తాన సేరందకూటం’. తెలుగులో ఈ సినిమా టైటిల్ ‘గ్యాంగ్’. నిన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా తమిళ్ వర్షన్ టిజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ రోజు విడుదల చేసిన తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్ బాగుంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కార్తీక్, రమ్యకృష్ణ, ఆర్.జె.బాలాజీ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

యు.వి క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను తెలుగులో విడుదల చెయ్యబోతుంది. అనిరుద్ సంగీతం అందించిన ఈ సినిమాలో సూర్య మాస్ లుక్ లో ఫాన్స్ ను అలరించబోతున్నాడు. గ్యాంగ్ చిత్రం సంక్రాంతి కానుకగా తెలుగు తమిళ్ లో ఒకేసారి జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తరువాత సూర్య సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.