సూర్య ‘గ్యాంగ్’ సినిమా రన్ టైం !

11th, January 2018 - 10:57:50 AM

సూర్య- కీర్తి సురేష్ జంటగా కోలీవుడ్‌లో రానున్న మూవీ ‘తానా సెరంధ కూట్టమ్‌’. తెలుగులో ‘గ్యాంగ్’ పేరుతో రేపు విడుదల కాబోతోంది. వేగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కు అనిరుద్ సంగీతం అందించాడు. రమ్య కృష్ణ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా రన్ టైం 2 గంటల 18 నిమిషాలు ఉందట. తమిళ్ లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

‘దేశంలో సమస్యలను ఈకల్లా పీకి పాడేయొచ్చు, గుండెల్లో ధైర్యం.. చేతిలో ధర్మం ఉంటే మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు’ గ్యాంగ్ సినిమా ట్రైలర్ లో ఉన్న ఈ డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. అనిరుద్ అందించిన సాంగ్స్ బాగుండడంతో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. త్వరలో సూర్య తెలుగులో చెయ్యబోతున్న విషయం ఈ మద్య ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించాడు.