వైరల్ వీడియో : తన లేటెస్ట్ మూవీ కోసం సూర్య హార్డ్ వర్కౌట్

Published on Feb 12, 2023 3:03 am IST


టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్య కి ఇటు తెలుగులో సైతం భారీ స్థాయి క్రేజ్ ఉంది. గజినీ సినిమాతో తెలుగులో పెద్ద సక్సెస్ అందుకుని అక్కడి నుండి మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నారు సూర్య. ఇక ప్రస్తుతం శివ దర్శకత్వంలో తన కెరీర్ 42వ మూవీ లో హీరోగా నటిస్తున్నారు సూర్య. భారీ యాక్షన్ డ్రామా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా కోలీవుడ్ కి చెందిన పలువురు నటులు కీలక పాత్రలు చేస్తున్నారు.

స్టూడియో గ్రీన్ సంస్థ పై ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ యొక్క షూట్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. 2023 ద్వితీయార్ధంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఇక ఈ మూవీలోని తన పాత్ర కోసం సూర్య జిమ్ లో ఎంతో కష్టపడి కసరత్తులు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హార్డ్ వర్క్ మరియు డెడికేషన్ కి సూర్య నిజమైన ఉదాహరణ అంటూ స్టూడియో గ్రీన్ వారు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో కొద్దిసేపటి క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియో చూసిన పలువురు ఫ్యాన్స్, ఆడియన్స్ సూర్య డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :