హీరో – విలన్.. రెండూ సూర్యనేనట.!

24-suriya
తమిళ్ – తెలుగు భాషల్లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న తమిళ స్టార్ హీరో సూర్య. డిఫరెంట్ కాన్సెప్ట్ తలతో కమర్షియల్ సినిమాలు చేయడానికి బాగా ఇష్టపడే సూర్య అలాంటి ఫ్లేవర్ లోనే సినిమాలు చేసే విక్రమ్ కుమార్ తో కలిసి చేసిన సినిమా ’24’. ఇప్పటి వరకూ సౌత్ ఇండియాలో రాణి కథతో, సైన్ ఫిక్షన్ నేపధ్యంలో రానున్న సినిమానే ఈ ’24’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాని సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తాం అంటూ రెండు రోజుల క్రితం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సూర్య ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ముందునుంచే చెప్పడం వలన రెండు డిఫరెంట్ గెటప్స్ ఇవే అని ఫిక్స్ అయిపోయారు.

కానీ తాజాగా విక్రమ్ కుమార్ అందరూ షాక్ అయ్యే ఓ విషయాన్ని తెలియజేశాడు. ’24 అనే సినిమాలో సూర్య డబుల్ రోల్ కాదు ట్రిపుల్ రోల్ చేసాడు. ఈ సినిమాకి తనే హీరో, తనే విలన్.. ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో విలన్ కి సంబదించిన లుక్ ని రిలీజ్ చేయలేదు. ఆ మూడవ పాత్ర పేరు ఆత్రేయ. సినిమాకి 24 అనే టైటిల్ ఎందుకు పెట్టామా అని న్తున్నారు ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత వచ్చే సీన్స్ లో 24 అని పెట్టడానికి వెనకున్న కారణాన్ని రివీల్ చేస్తామని’ విక్రమ్ కుమార్ తెలిపాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ని హీరో నితిన్ కొనుక్కున్నాడు.

తమిళ్ తో పాటు తెలుగులో కూడా స్టార్డం ఉన్న యంగ్ హీరో సూర్య, విభిన్న తరహా సినిమాలు చేసే విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ’24’ అనే ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాలో సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ముందుగా ఈ సినిమాని సంక్రాంతి రిలీజ్ అనుకొని ఆ తర్వాత సమ్మర్ కి పోస్ట్ పోన్ చేసారు.

కానీ మళ్ళీ సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయ్యారు. దానికి తగ్గట్టుగానే సహ్రవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని ఫినిష్ చేస్తున్నారు. కానీ తాజాగా మళ్ళీసూర్య అండ్ టీం సంక్రాంతి సీజన్ కి వద్దు సంమర్లోనే రావడం బెటర్ అని సినిమాని పోస్ట్ పోన్ చేసారు. ఈ సారి సంక్రాంతి నుండి తప్పుకోవడానికి ప్రధాన కారణం రజినీకాంత్ నటిస్తున్న ‘కబాలి’ సినిమా మరియు విజయ్ 59వ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుండడం. ఆ రెండింటి మధ్యలో ఎందుకనిసూర్య 24 ని వాయిదా వేసాడు. ఈ సినిమా తెలుగు మూవీ రైట్స్ ని నితిన్ దక్కించుకున్నాడు. ముంబై నేపథ్యంలో నడిచే ఈ సినిమా ఒక సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రానుంది.

Exit mobile version