కమల్ “విక్రమ్” లో ఈ స్టార్ హీరో?

Published on May 11, 2022 6:54 pm IST


చాలా కాలం తర్వాత కమల్ హాసన్ రీఎంట్రీ ఇస్తున్న విక్రమ్ సినిమా ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ బిగ్గీకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈరోజు ఈ చిత్రంలోని కొత్త పాటను విడుదల చేయనున్నారు మేకర్స్. ఇది కాకుండా తమిళ స్టార్ హీరో ఈ చిత్రం లో కనిపించనున్నాడు అని ఇప్పుడు వార్తలొస్తున్నాయి.

ఈ చిత్రంలో సూర్య చిన్న పాత్రలో కనిపించనున్నాడు అని టాక్. విక్రమ్‌లో ఇప్పటికే విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాసిల్ వంటి పెద్ద స్టార్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సూర్య ఈ సినిమాలోకి ఎంట్రీ ఇస్తే అభిమానులకు ట్రీట్ అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో.

సంబంధిత సమాచారం :