టాలీవుడ్‌లో ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ VD12 కోసమే అని చెప్పాలి. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండగా భారీ అంచనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ టీజర్‌ను ఫిబ్రవరి 12న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశారు మేకర్స్.
అయితే, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తుండటంతో ఈ టైటిల్ టీజర్‌ను కూడా పలు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే హిందీ టైటిల్ టీజర్ కోసం రణ్‌బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తెలుగులో ఎన్టీఆర్ వాయిస్ ఇస్తుండగా.. తాజాగా తమిళ్‌లో స్టార్ హీరో సూర్య తన వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
దీంతో ఈ టైటిల్ టీజర్‌కు తమిళ్‌లోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.