తెలుగులో రీ రిలీజ్ కి రెడీ అవుతున్న సూర్య కల్ట్ క్లాసిక్.!

Published on May 11, 2023 11:19 pm IST


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన చాలా చిత్రాల్లో ఆల్ మోస్ట్ అన్నీ తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యాయి. అయితే ఎప్పుడు నుంచో కూడా తెలుగులో కూడా మంచి మార్కెట్ ని సొంతం చేసుకున్న సూర్య తెలుగు ఆడియెన్స్ లో కూడా తన సినిమాలకి చెరగని ముద్ర వేసుకున్నాడు. మరి అలా తెలుగు ఆడియెన్స్ లో కూడా కల్ట్ క్లాసిక్ గా నిలిచిన చిత్రమే “సూర్య సన్నాఫ్ కృష్ణన్”.

దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆడియెన్స్ లో ఇప్పటికీ ఓ రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. ఇక హరీష్ జైరాజ్ ఇచ్చిన తెలుగు మ్యూజిక్ ఆల్బమ్ కూడా ఇప్పటికీ చార్ట్ బస్టరే. ఇందుకే ఈ చిత్రానికి ఇప్పటికీ మంచి పేరుంది. అయితే ఇపుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ రీ రిలీజ్ కి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే డేట్ ఎప్పుడు అనేది ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉందట. కానీ త్వరలోనే ఈ సూపర్ క్లాసిక్ సినిమా అయితే థియేటర్స్ ని హిట్ చేయనుంది అనేది మాత్రం కన్ఫర్మ్ అయ్యింది.

సంబంధిత సమాచారం :