అమితాబ్ స్పందనపై సూర్య ఎమోషనల్ రియాక్షన్!

Published on Sep 5, 2021 9:01 am IST


పలువురు కోలీవుడ్ స్టార్ హీరోల్లో టాలీవుడ్ లో కూడా మన హీరోలతో సమానంగా ఆదరణ అందుకునే తక్కువమంది సూర్య కూడా ఒకరు. తన లాస్ట్ చిత్రం “ఆకాశం నీ హద్దురా” ఓటిటి లో రిలీజ్ అయ్యినా అటు తమిళ్ తో పాటు తెలుగు లో కూడా సూపర్ అయ్యింది. దీనితో సూర్య కి మంచి బౌన్స్ బ్యాక్ హిట్ దొరికినట్టు అయ్యింది. అయితే ఈ సినిమాకి ప్రశంసల వెల్లువ మాత్రం ఇంకా ఆగలేదు.

ఆస్కార్ వరకు వెళ్లిన ఈ సినిమాపై తాజాగా ఇండియన్ లెజెండరీ నటుడు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా కొనియాడారు. అయితే దీనిపై సూర్య కూడా తన రియాక్షన్ ని తెలియజేసారు. ఇలాంటి అద్భుతమైన మాటలు, ప్రశంసలు లాంటివే తన సినిమా సూరారై పోట్రు కి గ్రేటెస్ట్ రివార్డులు అని మీ మాటలు తన మనసుని తాకాయని ఎమోషనల్ గా సూర్య స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత సమాచారం :