మరోసారి రిపీట్ కాబోతున్న సూర్య సెన్సేషనల్ కాంబో.!

Published on Oct 23, 2021 3:21 pm IST

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్య మళ్ళీ సాలిడ్ హిట్ ను అలాగే కం బ్యాక్ ను తన “ఆకాశం నీ హద్దురా” సినిమాతో అందుకున్న సంగతి తెలిసిందే. దీనితో మళ్ళీ అటు తమిళ్ అలాగే ఇక్కడ తెలుగులో కూడా సూర్య క్రేజ్ మళ్ళీ పెరిగి తన సినిమాలపై నమ్మకం పెట్టుకోవచ్చు అనిపించింది. ఇక ఇదిలా ఉండగా దీని తర్వాత మళ్ళీ ఇంకో సినిమా “జై భీమ్” తో సూర్య ఓటిటి రిలీజ్ కే రెడీగా ఉన్నాడు.

అయితే లేటెస్ట్ గా తమిళ్ మరియు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏదైతే ఆకాశం నీ హద్దురా కాంబో ఉందో, దర్శకులు సుధా కొంగర అలాగే సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ తో సూర్య మళ్ళీ వర్క్ చెయ్యనున్నట్టుగా ఫిల్మ్ సర్కిల్స్ లో నయా టాక్ బయటకి వచ్చింది. అయితే సూర్య హీరోగా సినిమానా లేక వారితో ఏదన్నా సినిమా నిర్మాతగా చేయబోతున్నారా అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది.

సంబంధిత సమాచారం :

More