కోలీవుడ్ స్టార్ నటుడు ది వన్ సూర్య హీరోగా నటించిన రెండు సినిమాలు ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్ అయ్యాయి. అయితే తాను హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన సెన్సేషనల్ కంబ్యాక్ హిట్ చిత్రం ‘వీర భద్రుడు’ ఈ ఏడాది మొదట వచ్చి కోలీవుడ్ లో ఈ ఏడాది బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక తెలుగులో కూడా మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా మళ్ళీ సూర్య మార్కెట్ ని నిలబెట్టింది.
అయితే ఫైనల్ గా ఈ సినిమా తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు జీ తెలుగు వారు సొంతం చేసుకోగా వీరు ఈ సినిమాని ఈ సెప్టెంబర్ 27 సాయంత్రం 6 గంటలకి ప్రసారం చేస్తున్నట్టుగా ఖరారు చేశారు. ఇక బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ ని ఈ సినిమా అందుకుంటుందో చూడాలి. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించగా డ్రీం వారియర్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.
Every Challenge Reveals the warrior within 🔥
Watch World Television Premiere #Veerabhadrudu Sunday at 6 PM on #ZeeTelugu#VeerabhadruduOnZeeTelugu #ZeeTeluguSpotlight @DreamWarriorpic pic.twitter.com/bmI6tpoENV
— ZEE TELUGU (@ZeeTVTelugu) September 24, 2026
