ఎవరికీ సాధ్యం కాని విధంగా ఫాస్టెస్ట్ 7 మిలియన్ ఫ్యామిలీ లోకి సూర్య.!

Published on Aug 24, 2021 12:21 pm IST


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. తన గత చిత్రం “ఆకాశం నీ హద్దురా” తో సాలిడ్ కం బ్యాక్ అందుకున్న సూర్య ఆ హిట్ బూస్టప్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. అయితే సూర్య కి ఒక్క కోలీవుడ్ లోనే కాకుండా మన తెలుగులో మంచి ఆదరణ సహా సూపర్ మార్కెట్ కూడా ఉంది.

అందుకే సూర్యకి ఓవరాల్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. మరి ఇదే ఫాలోయింగ్ సూర్య ఖాతాలో ఓ ఫాస్టెస్ట్ రికార్డు సెట్ చేసి పెట్టింది. తాజాగా సూర్య ట్విట్టర్ ఖాతా మొత్తం 70 లక్షల మంది ఫాలోవర్స్ కి చేరుకుంది. అది కూడా జస్ట్ ఆరేళ్లలోనే సూర్య ఈ ఫీట్ సాధించడం గమనార్హం.

మన దక్షిణాది నుంచి ఏ అగ్ర హీరోలకి కూడా ఈ ఫీట్ సాధ్యం కాలేదట. దీనితో ఈ ఫాస్టెస్ట్ 7 మిలియన్ ఫ్యామిలీ రికార్డును సూర్య అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక దీనిని పక్కన పెడితే సూర్య తాజాగా నటించిన “జై భీం” చిత్రం ప్రైమ్ వీడియోలో రిలీజ్ కి రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :