ఇంట్రెస్టింగ్..సూర్య పీకిన క్లాస్ రాణాని చాలా మార్చేసిందట.!

Published on Mar 4, 2022 3:00 pm IST

కోలీవుడ్ నుంచి మన టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ హీరోస్ లో సూర్య కూడా ఒకరు. అయితే సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ పక్కా మాస్ ఎంటర్టైనర్ చిత్రం “ఈటి”(ఎవరికీ తల వంచడు) తో థియేట్రికల్ గా చాలా కాలం తర్వాత పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు.

అయితే ఈ చిత్రంకి తమిళ్ తో పాటు మన దగ్గర కూడా మంచి అంచనాలు నెలకొనగా నిన్న ఈ సినిమా వేడుక ఒకటి జరిగింది. మరి దీనిలో సూర్య సహా హాజరైన సినీ ప్రముఖులు అనేక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెయ్యగా.. వీటిలో యంగ్ హీరో రానా దగ్గుబాటి చేసిన కొన్ని కామెంట్స్ హిలేరియస్ గా మారి వైరల్ అవుతున్నాయి.

దాదాపు ఓ పదేళ్ల కితమో ఎప్పుడో నా సినిమా ఎడిటింగ్ రూమ్ లో చూసి సూర్య నన్ను పిలిచి ఒక మూడు నాలుగు గంటలు పాటు తన కార్ లో కూర్చోబెట్టి తిప్పుకొని అరేయ్ అది ఆక్టింగ్ కాదురా అని గట్టిగా క్లాస్ పీకాడని.. అలా క్లాస్ పీకడం వల్లే ఈ రాణా భల్లాలదేవ అయినా డానియల్ అయినా చేయగలిగాడు అని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ని రివీల్ చేసాడు. దీనితో ఈ క్లిప్ మంచి వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :