గాయాల పాలైన సూర్య డైరెక్టర్!

Published on Feb 5, 2023 1:50 pm IST

స్టార్ డైరెక్టర్ సుధా కొంగర ప్రస్తుతం తమిళ బ్లాక్‌ బస్టర్ మూవీ సూరరై పొట్రు రీమేక్ అయిన అక్షయ్ కుమార్‌ తో తన హిందీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో రాధికా మదన్ కథానాయికగా నటిస్తోంది. షూటింగ్ సమయంలో డైరెక్టర్ గాయపడినట్లు వార్తలు వచ్చాయి. ఆమె అదే విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించడం జరిగింది.

సోషల్ మీడియా లో రెండు ఫోటోలను షేర్ చేయడం జరిగింది. తన విరిగిన చేతిని చూపిస్తూ, ఇది చాలా పెయిన్ గా ఉందని, చిరాకు గా ఉన్నాట్లు తెలిపారు. అంతేకాక ఇందుకు నెల రోజుల విశ్రాంతి అవసరం అని పేర్కొన్నారు. ఎలా జరిగిందనే వివరాలు ఇంకా తెలియలేదు. వర్క్ ఫ్రంట్‌లో, సుధా కొంగర కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో మళ్ళీ ఒక సినిమా చేయాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :