సూర్య “ET” డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధం…ఎప్పుడంటే?

Published on Mar 31, 2022 12:36 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల విడుదలైన ఎతర్కుం తునిందావన్ సినిమా థియేటర్లలో అభిమానులను మరియు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ లేడీ లీడ్ రోల్ లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్, సన్ ఎన్‌ఎక్స్‌టి దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 7, 2022న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందని తాజా వార్త. అయితే, సన్ NXT తన ప్లాట్‌ఫారమ్‌లో సినిమా స్ట్రీమింగ్ గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. అదే తేదీన సన్ ఎన్‌ఎక్స్‌టి కూడా దీన్ని ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంచుతుందని తెలుస్తోంది. తమిళ చిత్రం అన్ని ప్రధాన దక్షిణ భారత భాషల్లో మరియు హిందీలో కూడా ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :