సరికొత్త పోస్టర్లతో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన సూర్య “ఈటి”

Published on Feb 27, 2022 11:00 pm IST

సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎతర్కుం తునిందవన్. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ను కేవలం తమిళ్ లో మాత్రమే కాకుండా, మిగతా బాషల్లో కూడా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం ను తెలుగు లో ఈటి పేరుతో విడుదల చేయనున్నారు మేకర్స్.

ఈ చిత్రం రిలీజ్ డేట్ ను తాజాగా చిత్ర యూనిట్ ఫిక్స్ చేయడం జరిగింది. సరికొత్త పోస్టర్ల ను విడుదల చేసి రిలీజ్ డేట్ ను ప్రకటించడం జరిగింది. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, వినయ్ రాయ్, సత్యరాజ్ ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :