ఇంట్రెస్టింగ్ గా సూర్య “ఎతర్కుమ్ తునింధవన్” టీజర్!

Published on Feb 18, 2022 7:31 pm IST

ఎతర్కుమ్ తునింధవన్ నిస్సందేహంగా ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. సూర్య, ప్రియాంక అరుల్ మోహన్ నటించిన ఈ సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ టీజర్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది సూర్యని యాక్షన్ మోడ్‌లో ప్రదర్శిస్తుంది. టీజర్ పవర్ ఫుల్ డైలాగ్‌తో ముగిసింది.

నవీన్ రాయ్‌ని విలన్‌గా కూడా ప్రకటించారు మేకర్స్. విజువల్స్ మరియు ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ లో హైలైట్ గా నిలిచాయి అని చెప్పాలి. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో సూరి, సత్యరాజ్, సిబి భువన చంద్రన్ మరియు ఇతరులు ముఖ్య పాత్రలు పోషించారు. డాక్టర్ ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 10, 2022 న తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :