సూర్య “ఎతర్కుమ్ తునింధవన్” టీజర్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు

Published on Feb 18, 2022 2:31 pm IST


కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య, తన తాజా చిత్రం ఎతర్కుమ్ తునింధవన్ తో మళ్లీ ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా మార్చి 10, 2022 న విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించారు. తాజా సమాచారం ఏమిటంటే, ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 18, 2022న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ విషయాన్ని సూర్య ఉన్న సరికొత్త పోస్టర్ తో ప్రకటించడం జరిగింది. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ లో నటుడు సూర్యకు ప్రేమగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సూర్య వరుస సినిమాలు ఓటిటి లో విడుడలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అవుతుండటం, అది కూడా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండటం తో అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. టీజర్ ఎలా ఉండనుంది అనేది నేడు సాయంత్రం తెలియనుంది.

సంబంధిత సమాచారం :