తమిళ స్టార్ హీరో సూర్య తన తదుపరి సినిమాని స్టార్ డైరెక్టర్ బాలాతో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా షూటింగ్ అప్ డేట్ తెలిసింది. చెన్నై కోవళం బీచ్ వద్ద సముద్ర ప్రాంతంలో ప్లాష్ బ్యాక్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య డబుల్ రోల్ లో నటిస్తున్నాడు. సూర్య 41వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
సూర్య కోసం బాలా మంచి డెప్త్ ఉన్న కథ రాశాడని.. సూర్య కెరీర్ లోనే ఈ చిత్రం స్పెషల్ గా ఉండబోతుంది అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఆమె యాక్టింగ్ కు ఇంప్రెస్ అయిన బాలా ఈ సినిమాలో హీరోయిన్ గా ఆమెను ఫైనల్ చేశారని తెలుస్తోంది.
అలాగే టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ఐశ్వర్య రాజేష్ కి తెలుగులో మెయిన్ హీరోయిన్ పాత్రలు రాకపోయినా తమిళ మేకర్స్ మాత్రం ఆమెకు మంచి పాత్రలు ఇస్తున్నారు.