తిరిగి 25 నుండి మొదలుపెట్టనున్న సూర్య !


స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ‘తాన సెరెంద కూటం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యొక్క షూటింగ్ మొన్నటి వరకు బాగానే జరిగినా ఈ మధ్యే మొదలైన ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా మరియు నిర్మాతల మండలికి మధ్య తలెత్తిన వివాదం కారణంగా నిరసన మొదలై వాయిదా పడింది.

దీంతో అనుకున్న ప్రకారం షెడ్యూల్ పూర్తికాలేదు. పైగా నిరసన ముగిసే తేదీ కూడా తెలియకపోవడంతో కొత్త షెడ్యూల్ ను ప్లాన్ చేయలేకపోయారు దర్శక నిర్మాతలు. కానీ తాజాగా ఈ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కు, నిర్మాతల మండలికి మధ్య రాజీ కుదరడంతో నిరసనను నిలిపివేశారు. దీంతో చిత్ర యూనిట్ ఈ నెల 25 నుండి ఆఖరి షెడ్యూల్ ను తిరిగి స్టార్ట్ చేయనున్నారు. సూర్య కూడా ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.