‘ఉస్తాద్’, ‘ధురంధర్ 2’ లతో సూర్య సినిమా టీజర్?

suriyas viswanath and sons

ఈ ఉగాది కానుకగా థియేటర్స్ లో రాబోతున్న పలు అవైటెడ్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే హిందీ సినిమా నుంచి రాబోతున్న సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం ధురంధర్ 2 కూడా ఒకటి. మరి ఈ సినిమాల కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి థియేటర్స్ లో కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య కొత్త సినిమా ట్రీట్ కూడా ఉంటుంది అని బజ్ ఇపుడు వినిపిస్తుంది.

సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో చేస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తాలూకా టీజర్ ని మేకర్స్ ఇప్పుడు విడుదల చేస్తుండగా ఈ టీజర్ ని ఈ ఉగాది సినిమాలతో కలిపి అటాచ్ చేయనున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. సో ఆన్లైన్ లో ఇవాళ వచ్చే టీజర్ రెండు భారీ సినిమాలతో కూడా థియేటర్స్ లో సందడి చేయనుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుంది అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించిన ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతూ జూలైలో విడుదల కాబోతుంది.

Exit mobile version