సర్ప్రైజ్ : షెడ్యూల్ టైం కంటే ముందుగానే ఓటిటి లోకి ‘2018’ మూవీ

Published on Jun 6, 2023 8:00 pm IST

మలయాళం లో సూపర్ హిట్ కొట్టిన సర్వైవల్ థ్రిల్లర్ మూవీ 2018. ఈ మూవీలో టోవినో థామ‌స్‌, వినీత్ శ్రీనివాస‌న్‌, కుంచ‌కో బోబ‌న్‌, లాల్‌, అప‌ర్ణ బాల‌ముర‌ళి కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. గ‌త నెల‌లో మ‌ల‌యాళంలో రిలీజైన 2018 మూవీ రూ. 160 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి సంచలన విజయం నమోదు చేసింది. మ‌ల‌యాళ సినీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా ఇది నిలిచింది. 2018లో వ‌చ్చిన కేర‌ళ వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

ఇక ఇటీవల తెలుగులో కూడా విడుదలై సూపర్ హిట్ టాక్ ని కలెక్షన్ ని సొంతం చేసుకున్న ఈ మూవీని జూన్ 7 న పలు భాషల్లో తమ ఓటిటిలో రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు సోనీ లివ్ వారు. అయితే అనూహ్యంగా మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ల్లో 2018 మూవీని ఒకరోజు ముందుగానే నేడు తమ ఓటిటి లో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సోనీ లివ్ వారు తాజాగా తెలిపారు. మరి అటు థియేటర్స్ లో అన్ని భాషల్లో అదరగొట్టిన ఈ మూవీ ఓటిటి ఆడియన్స్ ని ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :