త్రివిక్రమ్ చిత్రంలో ఎవరూ ఊహించిన రోల్ లో పవన్ !


పవన్ – త్రివిక్రమ్ ల చిత్రం ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. కానీ ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వీరిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్ కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తి గా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా , అత్తారింటికి దారేది ఎలాంటి విజయాలు సాధించాయే తెలిసిన విషయమే. కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు చిత్రాన్ని విడుదల చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం విడుదలైన వెంటనే పవన్, త్రివిక్రమ్ చిత్రంపై దృష్టి పెట్టనున్నాడు. మార్చి 25 నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

రెగ్యులర్ షూటింగ్ ని మాత్రం ఏప్రిల్ లో ప్రారంభిస్తారట. ఈ చిత్రానికి సంబందించిన ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో సాఫ్ట్ వేర్ పాత్రలో కనిపిస్తాడట. దానికోసం రామోజీ ఫిలింసిటీలో ఓ పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ సెట్ వేశారని తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ ఏ.ఎస్. ప్రకాష్ ఆద్వర్యంలో ఈ సెట్ వేశారు. పవన్ కళ్యాణ్ సాఫ్ట్ వేర్ పాత్రలో కనిపించనుండడం ఫాన్స్ ని థ్రిల్ కి గురిచేసే అంశమనే చెప్పాలి. కాగా ఈ చిత్రానికి ‘దేవుడే దిగివచ్చినా’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటి ఖుష్బూ కీలక పాత్రలో నటిస్తోంది. అనిరుధ్ సంగీతం అందించనుండగా.. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.